Published On:

YS Sharmila on YS Jagan: జగన్ ప్రతీ విషయంలో ప్రజలను మోసం చేశారు!

YS Sharmila on YS Jagan: జగన్ ప్రతీ విషయంలో ప్రజలను మోసం చేశారు!

YS Sharmila comments On YS Jagan: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై షర్మిల స్పందించారు. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణించడం తప్పని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. కానీ జగన్ దానిని ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమని తెలిపారు. జగన్ ప్రతీ విషయంలోనూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి రాలేదని.. ఇప్పుడు జనసమీకరణ కోసం బలప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు.

 

జగన్ కు నిబంధనలు, ఆంక్షలు ఉండవు. మూడు బండ్లు అంటే ముప్పై బండ్లతో వెళ్తారు. జగన్ మోదీ దత్తపుత్రుడా? కార్ల కింద మనుషులని నలుపుకుంటూ పోతూ, మానవత్వం గురించి మాట్లాడుతారా? జగన్ కు అసెంబ్లీకి వెళ్లి సమాధానం చెప్పే దమ్ము లేదు. రుషికొండలని ఎందుకు గుండుగొరిగారు? మద్యపాన నిషేధం చేస్తామని ఎందుకు కుంభకోణానికి పాల్పడ్డారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

 

కాంగ్రెస్ ను నిలబెట్టడానికి తన అవసరం ఉందని పంపించారని తెలిపారు. తనకు, జగన్ కు ఉన్న విభేదాలు, రాష్ట్ర సమస్యలతో పోల్చితే చాలా చిన్నవన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే తమకు విభేదాలు వచ్చాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడగలదని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఆకుతోట గిరిజనకాలనీ నుంచి ఇందిరా భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. గాంధీబొమ్మ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడం అవసరమని పేర్కొన్నారు.

 

ఇవి కూడా చదవండి: