Chennamaneni Ramesh: ఓటరు లిస్ట్ నుంచి చెన్నమనేని రమేశ్ పేరు తొలగింపు

Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పేరును ఎన్నికల ఓటరు జాబితా నుంచి తొలగించారు రెవెన్యూ అధికారులు. ఈ మేరకు చెన్నమనేని రమేష్ బాబు ఇంటికి నోటీసులు అంటించారు. తెలంగాణ హైకోర్టు చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడైనని నిర్ధారించినందున ఎన్నికల ఓటర్ జాబితా నుండి ఫామ్ 7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు వేములవాడలోని చెన్నమనేని రమేశ్ నివాసానికి నోటీస్ అందజేయడమే గాకుండా ఆయనకు రిజిస్టర్డ్ పోస్ట్ చేశారు అధికారులు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై 2 తేదీ లోగా సమాధానం ఇవ్వాలని తెలిపారు అధికారులు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు రెవెన్యూ అధికారులు.