Published On:

Kannappa: విష్ణు పేరు ప్రస్తావించకుండా కన్నప్ప టీంకు మనోజ్ శుభాకాంక్షలు

Kannappa: విష్ణు పేరు ప్రస్తావించకుండా కన్నప్ప టీంకు మనోజ్ శుభాకాంక్షలు

Kannappa: కన్నప్ప సినిమా రేపు రిలీజ్ కానుంది. చిత్రమేకింగ్ నుంచి చాలా సవాళ్లను విమర్శలను ఎదుర్కున్న కన్నప్ప చివరికి ప్రశాంతంగా రిలీజ్ అవనుంది. ఈ సినిమాకు మంచు విష్ణు హీరోగా చేస్తుండగా మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో మనోజ్ కు విష్ణుకు మనస్పర్ధలు వచ్చాయన్నది ఒపెన్ సీక్రెట్. అందులో భాగంగానే మనోజ్ బయటే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే మనోజ్ కన్నప్ప సినిమాకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇందుకుగాను ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

“మా నాన్న ఆయన టీం… కన్నప్ప సినిమా కోసం చాలా సంవత్సరాలు కష్టపడ్డారు. ఇందులో వారి ప్రేమ, శ్రమ దాగి ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాను. మా లిటిల్ చాంప్స్ అరి, వివి, అవ్రమ్ లను సిల్వర్ స్ర్కీన్ పై చూడాలని ఆత్రుతగా ఉంది. రేపు తణికెళ్ల భరణి గారి కల సాకారం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. బంగారు మనసున్న ప్రభాస్ గారికి మనస్పూర్తిగా థ్యాక్స్ చెప్పుకుంటున్నా. మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభుదేవా గారికి ఈ సినిమాలో పనిచేసిన సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్. ఆ పరమేశ్వరుడు ఈ సినిమాను ఆశీర్వదించాలి. వెండి తెరపై ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురుచూస్తున్నా, రేపటికోసం” అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

 

మనోజ్ అందరిగురించి ప్రస్తావించాడు కానీ విష్ణు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. గతకొన్ని రోజులుగా విష్ణుకు, మనోజ్ కు అంతరాలు పెరిగాయని అందరికీ తెలిసిందే. తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఇద్దరి మనస్పర్థలగురించి ఓ ఇంటర్వూలో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఈసినిమా జూన్ 27న పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రన్ టైం 3 గంటల 2నిమిషాలు.

 

 

ఇవి కూడా చదవండి: