Published On:

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేసిన ముగ్గురు అరెస్ట్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై కామెంట్స్ చేసిన ముగ్గురు అరెస్ట్

Youngsters Arrested Due To Inappropriate Posts In Social Media: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టులు చేసిన ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ వేదికగా జరిగిన యోగా దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన పలువురిపై జనసేన నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అనుచిత పోస్టులు పెట్టిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. వీరిలో కొందరిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఏ1 గా ఉన్న పలువురు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏ2గా ఉన్న ఉప్పలగుప్తం మండలం యస్ యానాంకు చెందిన కర్రీ వెంకట సాయి వర్మ, ఏ3 గా యలమంచిలి మండలం వందలపాకకు చెందిన పాముల రామాంజనేయులు, ఏ4 గా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సరూర్ నగర్ వాసి షేక్ మహబూబ్ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టడం, కామెంట్స్ చేయడం నేరమని.. అనవసరంగా ఇలాంటి పనులు చేసి జీవితం పాడుచేసుకోవద్దని పోలీసులు సూచించారు. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: