Published On:

Pawan Kalyan: ప్రగతి నివేదిక పేరుతో ప్రజలకు పవన్‌ కళ్యాణ్ లేఖ!

Pawan Kalyan: ప్రగతి నివేదిక పేరుతో ప్రజలకు పవన్‌ కళ్యాణ్ లేఖ!

Pawan Kalyan: ఏడాది పాలన, అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రగతి నివేదిక పేరుతో లేఖ విడుదల చేశారు. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయానికి అండగా నిలిచి, రాష్ట్రాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

2019 నుంచి 2024 వరకు రాష్ట్రం నియంతృత్వ పాలకుల పాలనలో నలిగిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధికి దూరమై శాంతిభద్రతలు క్షీణించి, యువత భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకొని, మహిళలకు రక్షణ కరువై.. రాజధాని నిర్మాణం ఆగిపోయిన సమయంలో ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు.

 

రాష్ట్రాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించేందుకు ప్రధాని మోదీ, సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన నాయకుడు, సీఎం చంద్రబాబు సారథ్యంలో పోటీ చేశామని పవన్ తెలిపారు.  అందరి సమష్టి సహకారంతో ఎన్డీయే కూటమి 164 అసెంబ్లీ సీట్లు గెలిచి 94శాతం స్ట్రైక్‌ రేట్‌తో చారిత్రాత్మక విజయం సాధించిందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా; పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రిగా

బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్రజలు NDA కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గత సంవత్సర కాలంలో శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలతో పంచుకోవాలని, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధి నివేదిక విడుదల చేస్తున్నాము. ప్రజలందరూ ఈ నివేదిక ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తూ, రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గౌ|| ప్రధానమంత్రి శ్రీ

గారి మార్గదర్శకత్వంలో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ

గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిబద్ధతతో NDA ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచెయ్యనుంది. ” అని ట్వీట్ చేశారు పవన్.

 

 

ఇవి కూడా చదవండి: