AP Former CM YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదు.. పెట్టిన కొత్త సెక్షన్లు ఇవే!

Guntur police case filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదైంది. ఇటీవల జగన్ పర్యటనలో జగన్ కారు కిందపడి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మాజీ సీఎం జగన్‌పై BNS 106(1) Section కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరించి ఇతరుల మరణానికి కారణమైతే కేసు పెడ్తారు. తాజాగా, కొత్త సెక్షన్లు బీఎన్ఎస్ 105, 49 చేర్చారు. హత్య కిందకు రాని నేర విషయాల్లో బీఎన్ఎస్ 105 ఉపయోగిస్తారు. ఈ కేసు కింద అతనిపై నిరూపణ అయితే జీవిత ఖైదు లేదా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ నాన్ బెయిలబుల్ కిందకు వస్తుంది. ఇక, నేరానికి ప్రేరేపించారంటూ బీఎన్ఎస్ 49 సెక్షన్ విధించారు.