Published On:

CM Siddaramaiah arrest: ‘పుష్ప‌2’ అల్లు అర్జున్ తరహా తొక్కిసలాటతో ‘బెంగళూరు’ పోలిక.. సీఎం, డిప్యూటీ సీఎంలను అరెస్ట్ చేస్తారా..?

CM Siddaramaiah arrest: ‘పుష్ప‌2’ అల్లు అర్జున్ తరహా తొక్కిసలాటతో ‘బెంగళూరు’ పోలిక.. సీఎం, డిప్యూటీ సీఎంలను అరెస్ట్ చేస్తారా..?

BJP Demand to CM Siddaramaiah, Deputy CM Shivakumar arrest : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతిచెందగా.. మరో 40 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. తాజాగా, కొంతమంది గతంలో జరిగన సంఘటనలకు ఈ ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని జోడించి చర్యలు ఉంటాయా? అని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం శివకుమార్‌లను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.

 

కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తొక్కిసలాటపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. కొన్ని నెలల క్రితం పుష్ప2 మూవీ రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారని అరెస్ట్ చేశారు. తాజాగా, అలాగే ఆర్సీబీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ బాధ్యతగా వ్యవహరించలేదని, అందుకే సీఎం, డిప్యూటీ సీఎంలను బాధ్యులుగా చేస్తూ అరెస్ట్ చేయాలని బీజేపీ నేత, ఎంపీ సంబిత్ డిమాండ్ చేశారు.

 

చిన్న స్వామి స్టేడియం కెపాసిటీ 35వేలే. అయితే విక్టరీ పరేడ్ కార్యక్రమానికి దాదాపు 3 లక్షల మంది వచ్చారని తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య జరుగుతున్న విభేదాల కారణంగా తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. పోలీసులు ఈ విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని అయినా ప్రోగ్రాం చేసుందుకు నిర్ణయించారన్నారు. ఒకవైపు తొక్కిసలాట జరిగి చనిపోయినా.. సన్మాన కార్యక్రమాలు చేశారని ఆరోపించారు.

 

ప్రమాదంపై ప్రధానితో సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పాసులు లేక కొంతమంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో లాఠీఛార్జ్ చేయగా.. తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన తొక్కిసలాటను పోల్చుతున్నారు. తొక్కిసలాటకు కారణమైన అల్లుఅర్జున్‌ను గతం అరెస్ట్ చేసిన విధంగా.. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను అరెస్ట్ చేస్తారా? అని ఎక్స్ వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.