Last Updated:

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని 3 నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PM-GKAY) పథకాన్ని డిసెంబర్ 2022 వరకు మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Free Ration Scheme: ఉచిత రేషన్ పథకాన్ని 3 నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

New Delhi: ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PM-GKAY) పథకాన్ని డిసెంబర్ 2022 వరకు మూడు నెలల పాటు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.3.45 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. “డిసెంబర్ 2022 వరకు తాజా పొడిగింపు కింద, కేంద్రం సుమారు రూ. 44,762 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.

ఏప్రిల్ 2020 నుండి అమలులో ఉన్న PM-GKAY పథకం యొక్క ప్రస్తుత దశ శుక్రవారం (సెప్టెంబర్ 30)తో ముగుస్తుంది. ఈ పధకానికి దేశంలో 80 కోట్ల మంది లబ్దిదారులున్నారు. PM-GKAY కింద, ప్రతి లబ్ధిదారుడు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద అతని సాధారణ ఆహార ధాన్యాల కోటాతో పాటు ప్రతి వ్యక్తికి నెలకు అదనంగా 5 కిలోల ఉచిత రేషన్‌ను పొందుతాడు. అంటే ప్రతి పేద కుటుంబానికి సాధారణ రేషన్ కంటే దాదాపు రెట్టింపు రేషన్ అందుతుంది.

ఫేజ్-VII (అక్టోబర్-డిసెంబర్ 2022) సమయంలో సుమారు 122 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాన్ని కేటాయించనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పీఎం-జీకేఏవై కింద ఫేజ్ VI కింద ప్రభుత్వం సుమారు 244 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) ఉచిత ఆహారధాన్యాలను కేటాయించింది. PM-GKAY కింద ఇప్పటి వరకు దాదాపు 1,003 LMT ఆహార ధాన్యాలను కేటాయించారు.

 

ఇవి కూడా చదవండి: