Last Updated:

Karnataka: జైలు నుంచి ఆసపత్రికి చేరిన మురుగమఠం పీఠాధిపతి శివమూర్తి

మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిన మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుకు జైలులో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో శుక్రవారం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Karnataka: జైలు నుంచి ఆసపత్రికి చేరిన మురుగమఠం పీఠాధిపతి శివమూర్తి

Karnataka: మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపిన మురుగ మఠం ప్రధాన పీఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుకు జైలులో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో శుక్రవారం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

గురువారం అర్థరాత్రి అరెస్టు చేసిన తర్వాత అతడిని చాలా గంటలపాటు ప్రశ్నించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జైలుకు పంపిన వెంటనే అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అరెస్టు అయిన వెంటనే, శరణారావును స్థానిక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు చిత్రదుర్గ పోలీసు సూపరింటెండెంట్ కె పరశురాం విలేకరులకు తెలిపారు. “ఆర్డర్ తరువాత, అతన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు మరియు తరువాత జైలుకు పంపారు” అని అతను చెప్పాడు.

మురుగ మఠం పీఠాధిపతితో పాటు మరో నలుగురి పై ‘సాంత్వనా కేంద్రం’ (మహిళా శిశు అభివృద్ధి శాఖ డైరెక్టరేట్ కౌన్సెలింగ్ కేంద్రం) లో పనిచేస్తున్న ఒకరిపై కేసు నమోదు చేయగా, మరొకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వీరి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి. తదుపరి విచారణ కోసం పోలీసులు కస్టడీకి దరఖాస్తు చేసుకుంటారని పరశురాం తెలిపారు.

ఇవి కూడా చదవండి: