England vs India: టీమ్‌ఇండియా చెత్త రికార్డు.. ఐదు సెంచరీలు చేసినా!

England won by 5 Wickets: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందింది. లీడ్స్ వేదికగా జరిగిన ఈ టెస్టులో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు, ఫీల్డర్ల వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచ్ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. డకెట్(149), క్రాలీ(65), రూట్(53), స్టోక్స్(33), జేమీ స్మిత్(44) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో ప్రసిద్ధ్, శార్దూల్ తలో రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో465 పరుగులు చేసింది.
అయితే, తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడి చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 5 సెంచరీలు చేసి ఓడిన తొలి జట్టుగా నిలిచింది. అయితే 1877లో టెస్ట్ క్రికెట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ 148 ఏళ్లలో ఒక్క టీమ్ కూడా ఒకే సిరీస్‌లో 5 సెంచరీలు చేసి ఓడిపోలేదు. కాగా, ఈ టెస్ట్ మ్యాచ్‌లో పంత్ రెండు సెంచరీలు(134, 118), యశస్వి జైస్వాల్(101), శుభ్‌మన్ గిల్(147), కేఎల్ రాహుల్(137) ఒక్కో సెంచరీ బాదాడు.