Published On:

RBI: ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష.. కీలక వడ్డీ రేట్లు తగ్గింపు

RBI: ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష.. కీలక వడ్డీ రేట్లు తగ్గింపు

RBI Review: ద్రవ్య పరపతి విధానంపై ఆర్బీఐ సమీక్ష చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతమున్న రెపోరెటు 6 నుంచి 5.5 శాతానికి తగ్గనుంది. కాగా వరుసగా మూడోసారి ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో వాహన, గృహ, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ఇక వడ్డీ రేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్ కనిపించింది.

 

అయితే గృహ రుణాలపై 7.5 శాతం వరకు వడ్డీ రేటు తగ్గనుంది. వడ్డీ రేట్లు తగ్గడంతో మార్కెట్ లో ద్రవ్య లభ్యత పెరిగనుంది. మరోవైపు ద్రవ్యోల్బణం 4 శాతం నుంచి 3.7 శాతానికి దిగిరావొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతంగా ఆర్బీఐ నిర్ణయించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.75 శాతంగా నిర్ణయించింది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో సగటు మానవునికి ఎంతో ఊరట కలగనుంది.