Pakistan: పీఎం మోదీని కాపీ కొట్టిన పాక్ ప్రధాని

Pakistan: పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుద్ధట్యాంక్ ఎక్కారు. పర్యటనలో మోదీని పాక్ ప్రధాని కాపీ కొడుతున్నారు. రెండురోజుల క్రితం అదంపూర్ ఎయిర్ బేస్‌ను మోదీ సందర్శించారు. సైనికులతో కలిసి భారత ప్రధాని ముచ్చటించారు. మన ఎయిర్‌బేస్ సురక్షితంగా ఉన్నట్టు ప్రపంచానికి సందేశమిచ్చారు. ఇదేరకంగా మోదీని పాక్ ప్రధాని ఫాలో అవుతున్నారు. మోదీ సైనికులతో ముచ్చటించిన మరుసటి రోజు పాక్‌లోని ఓ గ్రౌండ్‌లో పాకిస్తాన్ ప్రధాని సైనికులతో మాట్లాడారు. యుద్ధట్యాంకర్ ఎక్కి మోదీలాగే ప్రసంగించారు. అయితే సైనిక స్థావరంలో కాకుండా ఎక్కడో ఓ గ్రౌండ్‌లో సెట్ వేయడంతో పాక్ ప్రధాని అభాసుపాలయ్యారు.
ఇండియా -పాకిస్తాన్‌ల మధ్య శనివారం కుదిరిన కాల్పుల ఒప్పందం గురించి యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ నవ్వుల పాలయ్యింది. కాల్పుల ఒప్పందానికి అంగీకరించి.. వెంటనే గండికొట్టడం పాకిస్తాన్‌కే చెల్లింది. పాకిస్తాన్‌ను ప్రపంచంలోని ఏ దేశం నమ్మడం లేదు. ఇటీవల పాక్ అసెంబ్లీలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ఈ యుద్ధంలో ముస్లిం దేశాలు కూడా మనకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రపంచంలోని ఏ దేశం మనల్ని నమ్మడం లేదని వాపోయాడు. కేవలం ఒక్క టర్కీ మాత్రం ఆపదలో ఆపన్నహస్తం అందిస్తోందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచదేశాల ముందు పాకిస్తాన్ విలువ ఏ పాటిదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు.
ఆపరేషన్ సింధూర్ తో దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదన్న సంకేతాలు పంపారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాదు పాకిస్తాన్ ప్రజలు అలాగే సైనిక స్థావరాలపై ఎప్పుడూ దాడులు జరపకుండా ఎంతో సంయమనంతో నరేంద్ర మోడీ వ్యవహరించారు.
అమెరికాలో అత్యంత ప్రజాదరణ కలిగిన పాడ్ కాస్ట్ పీబీడీ . దీని హోస్ట్ ప్యాట్రిక్ బెట్ డెవిడ్.. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోజరుగుతున్న హాట్ టాపిక్స్‌గురించి చర్చిస్తుంటారు. కాగా పీబీడీలో బిజినెస్ నుంచి కరెంట్ ఈవెంట్స్, పాలిటిక్స్ నుంచి స్పోర్ట్స్ వరకు చర్చిస్తారు.. అమెరికాలోని టాప్ యూ ట్యూబ్ వ్యూస్‌లో పీబీడీ మూడోస్థానంలో ఉంది. తాజాగా ఇండియాలో జరిగిన పాక్ టెర్రర్ దాడుల గురించి .. ఇండియా… పాక్ యుద్ధం గురించి పాడ్‌కాస్ట్‌లో చర్చించారు.