12 Years Boy Suicide: అమ్మా నేను చిప్స్ దొంగిలిచలేదమ్మా.. బాలుడు ఆత్మహత్య

12 Years Boy Suicide in Kolkata: అవమాన భారంతో పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేయని తప్పుకు రోడ్డుపై కొట్టినందుకు ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆ చిన్నారి మనోవేదనకు గురయ్యాడు. కోల్ కతా లోని పశ్చిమ మేదినీపుర్ బజాజ్ ప్రాంతంలో కృష్ణేందు దాస్ (12) తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. అదేప్రాంతంలోని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి నడుపుతున్న దుఖానానికి వెళ్లాడు. అక్కడ తన తల్లి ఇచ్చిన డబ్బుతో చిప్స్ కొనుక్కోవడానికి వెళ్లాడు. షాప్ కు వెళ్లి దీక్షిత్ ను పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచినా దీక్షిత్ రాకపోయేసరికి చిప్స్ ప్యాకెట్ తీసుకుని నగదును తర్వాత ఇవ్వవచ్చుకదా అని ఇంటికి బయలు దేరాడు.
బాబు చిప్స్ ప్యాకెట్ పట్టుకుని వెళ్తున్నప్పుడు దుఖానం యజమాని అయిన దీక్షిత్ చూశాడు. పిల్లవాడు తన షాప్ లో దొంగతనం చేసి 10రూపాయల చిప్స్ ప్యాకెట్ ను తీసుకెళ్తున్నాడని ఊహించుకుని పిల్లవాడిని రోడ్డులో ఆపి చెంప మీద పదేపదే కొట్టాడు. అదీ చాలదనక పిల్లవాడి అమ్మను పిలిచి నానా రచ్చ చేశాడు. రోడ్డుపైనే పిల్లవాడు తన షాప్ లో దొంగతనం చేశాడని అక్కడ ఉన్నవారికి చూపెడుతూ.. బాలుని చేత గుంజీలు తీయించాడు. పిల్లవాడు తాను దొంగతనం చేయలేదని చెప్పడానికి ప్రయత్నించినా దీక్షిత్ వినలేదు. దీంతో చేసేదేమి లేక ఆతల్లి కూడా పిల్లవాడిని కొట్టింది. ఇంటికి ఈడ్చుకెళ్లింది.
తల్లితోపాటు ఇంటికి చేరుకున్న బాలుడు మరో గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కొంతసేపటి తర్వాత బాలుడు ఉన్న రూంలో ఎలాంటి చడీచప్పుడు లేకపోయేసరికి, ఆతల్లికి అనుమానం వచ్చింది. డోర్ కొట్టి పిలిచినా లోపలినుంచి సమాధానం లేదు. భయానికి గురైన తల్లి ఇంటి పక్కన ఉన్నవాళ్ల సహాయంతో డోర్ ను పగులకొట్టింది. అప్పటికే నురగ కక్కుకుని ఉన్నాడు. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందులూ ఆ బాలుడు ప్రాణాలు విడిచాడు.
బాలుడి రూంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ లో బాలుడు తాను దీక్షిత్ కిరాణం షాపుకు వెళ్లానని అయితే ఆయన్ని ఎన్నిసార్లు పిలిచినా బయటకు రాలేదని తెలిపాడు. అక్కడే పక్కన పడిఉన్న కురుకురే ప్యాకెట్ ను తీసుకున్నానని రాశాడు. అయితే అది తాను దొంగతనం చేశానని దీక్షిత్ అనుకున్నాడని వివరించాడు. తాను దొంగతనం చేయలేదని దొంగను కాదని అందులో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుఖానధారుడైన దీక్షిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.