DMK Files: తమిళనాడు ఆర్దికమంత్రి పదవి కోల్పోయిన పీటీఆర్.. డీఎంకే ఫైల్సే కారణమా ?
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత సీఎం స్టాలిన్ మొదటిసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ సందర్బంగాస్టాలిన్ ప్రభుత్వంలో గత రెండేళ్లుగా ఆర్దికమంత్రిగా ఉన్న త్యాగరాజన్ ను ఐటీ మంత్రిత్వశాఖ కు మార్చారు. పీటీఆర్ అని కూడా పిలువబడే పళనివేల్ త్యాగ రాజన్ గత రెండేళ్లుగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
DMK Files: తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత సీఎం స్టాలిన్ మొదటిసారిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. ఈ సందర్బంగాస్టాలిన్ ప్రభుత్వంలో గత రెండేళ్లుగా ఆర్దికమంత్రిగా ఉన్న త్యాగరాజన్ ను ఐటీ మంత్రిత్వశాఖ కు మార్చారు. పీటీఆర్ అని కూడా పిలువబడే పళనివేల్ త్యాగ రాజన్ గత రెండేళ్లుగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
రూ.1.34 లక్షల కోట్ల ఆస్తులు..(DMK Files)
అయితే ఇటీవల ఆయన స్టాలిన్ కుటుంబం అవినీతి గురించి ఆయన మాట్లాడారంటూ బయటకు వచ్చిన ఆడియో టేపు కలకలం సృష్టించింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఈ ఆడియో టేపులను విడుదల చేసారు,గత నెలలో భారతీయ జనతా పార్టీ ‘డీఎంకే ఫైల్స్’ టేపులను విడుదల చేయడంతో తమిళనాడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి, అల్లుడు, వి శబరీశన్, సోదరి కనిమొళి, బంధువు కళానిధి మారన్‌లకు చెందిన రూ.1.34 లక్షల కోట్ల ఆస్తుల వివరాలను పంచుకునే 15 నిమిషాల నిడివి గల వీడియోను టీఎన్ బీజేపీ చీఫ్ కే అన్నామలై వెల్లడించారు.
సీఎం కొడుకు, అల్లుడు పార్టీ..
ఏప్రిల్ 19 న ఆడియో క్లిప్‌ను విడుదల చేసారు.ఇందులో స్టాలిన్ కుటుంబ సభ్యులు మరియు డిఎంకె నాయకులపై ఆరోపణలు చేస్తున్న పీటీఆర్ వాయిస్ ఉందని అతను పేర్కొన్నాడు.ఏప్రిల్ 25న, మరో 57 సెకన్ల ఆడియో క్లిప్‌ను విడుదల చేసి దానిని PTR-2 అని పిలిచారు.ఇది సిస్టమ్ కాదు. వాళ్లు ఎక్కువ మొత్తంలో కొల్లగొడుతున్నారు… సీఎం కొడుకు, అల్లుడు పార్టీ. అందుకే దీన్ని 8 నెలల పాటు చూసిన తర్వాత నిర్ణయించుకున్నాను, ఇది స్థిరమైన మోడల్ కాదు. నేను బయటపడతాను. నా మనస్సాక్షి యొక్క పరిశుభ్రత నాకు ఉంది అంటూ మాట్లాడినట్లుగా ఉంది.
టేపులను విడుదల చేసిన తర్వాత, పళనివేల్ త్యాగ రాజన్ తిరస్కరణను జారీ చేశారు మరియు టేపులు ‘కల్పితం’ అని అన్నారు. సీఎం కుమారుడు మరియు అల్లుడిపై వ్యాఖ్యలు చేశారనే వాదనలను తోసిపుచ్చారు. మరోవైపు తనపై, తన మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు చేసినందుకు అన్నామలైపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం పరువు నష్టం దావా వేశారు.