World Dairy Summit 2022: వరల్డ్ డెయిరీ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ను ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్‌లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు.
Greater Noida: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరల్డ్ డెయిరీ సమ్మిట్ 2022ని ప్రారంభించారు. ఈ సమ్మిట్‌ను ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్‌లు సంయుక్తంగా గ్రేటర్ నోయిడా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇక్కడి ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని ఆసక్తికరంగా పరిశీలించారు. కేంద్రమంత్రి పురుషోత్తమ్ రుపలా వరల్డ్ డెయిరీ సమ్మిట్ -2022ను ఉద్దేశించి ప్రసంగించారు. 48 సంవత్సరాల తర్వాత ఈ సదస్సు జరుగుతోందన్నారు. ప్రస్తుతం భారత్ పాల ఉత్పత్తి రోజుకు 220 మిలియన్ టన్నులు అని ఆయన అన్నారు. ఆత్మనిర్బర్ బారత్ కింద అదనపు పాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం నాలుగు రోజుల పాటు ఆ సదస్సు జరుగుతుందని తెలిపింది. ఈ నెల 12 నుంచి 15 వరకు కొనసాగుతున్న ఈ సమ్మిట్‌లో విదేశీ డైయిరీ భాగస్వాములతో పాటు దేశీయ భాగస్వాములు కూడా పాల్గొంటారని వెల్లడించింది. ఇక భాగస్వాముల విషయానికి వస్తే డెయిరీ రంగానికి చెందిన అతి పెద్ద వ్యాపారులు, నిపుణులు, రైతులు, పాలసీ ప్లానర్స్ పాల్గొంటారు. ఈ సమ్మిట్ థీమ్‌ను డెయిరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్‌గా నామకరణం చేశారు.
50 దేశాలకు చెందిన సుమారు 1,500 మంది ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. చివరగా డెయిరీ సమ్మిట్ 1974లో జరిగింది. ఇక మన డెయిరీ ఇండస్ర్టీ విషయానికి వస్తే కో ఆపరేటివ్ మోడల్‌లో కొనసాగుతోంది. దీనితో చిన్న రైతులు ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా లాభపడతారు. ప్రధానమంత్రి దూరదృష్టితో ఈ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ప్రధాన తీసుకున్న నిర్ణయం వల్ల గత ఎనిమిదేళ్లో పాల ఉత్పత్తి 44 శాతం పెరిగిందని పీఎంఓ తెలియజేసింది.
ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో భారత్ వాటా 21 శాతం వరకు ఉంటుంది. ఏడాదికి 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 8 కోట్ల మంది రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి లబ్ధి పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి పశు సంవర్ధశాఖమంత్రి పురుషోత్తమ్ రుపాలా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.