Last Updated:

Swati Maliwal: నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్

:ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తాను చిన్నతనంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పారు. శనివారం మహిళా కమిషన్ నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న స్వాతి మలివాల్ మాట్లాడుతూ, అవార్డు గ్రహీతల పోరాట కథలు తన సొంత పోరాటాన్ని గుర్తుచేశాయని అన్నారు.

Swati Maliwal: నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు.. ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్

Swati Maliwal:ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తాను చిన్నతనంలో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పారు. శనివారం మహిళా కమిషన్ నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న స్వాతి మలివాల్ మాట్లాడుతూ, అవార్డు గ్రహీతల పోరాట కథలు తన సొంత పోరాటాన్ని గుర్తుచేశాయని అన్నారు. ఇవి తనను భావోద్వేగానికి గురిచేసాయని అన్నారు.

భయంతో మంచం కింద దాక్కునే దాన్ని..(Swati Maliwal)

తన తండ్రి తనపై ‘లైంగిక వేధింపులకు పాల్పడేవాడని తెలిపారు. అంతేకాదు మా నాన్న నన్ను చాలా కొట్టేవారు.. ఇంటికి రాగానే మంచం కింద దాక్కొనేదాన్ని. నాకు చాలా భయంగా ఉండేది.. ఆ సమయంలో ఇలాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆడవాళ్లకు ఎలా సాధికారత కల్పించాలా అని రాత్రంతా ఆలోచించేదాన్ని. నా జుట్టు పట్టుకుని గోడకు బలంగా కొట్టేవారు.కానీ మహిళల సంక్షేమం కోసం పని చేయాలనే నాలో ఉన్న దృఢ నిశ్చయంతోనే ఇవన్నీ భరించానని తెలిపారు.

కేజ్రీవాల్ కు సలహాదారుగా..

2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారు. తర్వాత ఆమె పదవీకాలాన్ని పొడిగించారు. అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుగా పనిచేశారు. స్వాతి మలివాల్ హర్యానా ఆప్ మాజీ చీఫ్ నవీన్ జైహింద్‌ను వివాహం చేసుకున్నారు. వారు 2020లో విడాకులు తీసుకున్నారు.మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. జనవరిలో, ఢిల్లీలో మలివాల్ రాత్రి భద్రతా పరిస్థితిని పరిశీలిస్తుండగా తాగిన క్యాబ్ డ్రైవర్ తన కారు విండోలోనుంచి ఆమె చేయిపట్టుకుని లాగాడు.

ఇటీవల, నటిగా మారిన రాజకీయవేత్త బిజెపికి చెందిన ఖుష్బు సుందర్, జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా మారారు.ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి ద్వారా లైంగిక వేధింపులకు గురైన తన ప్రత్యక్ష అనుభవాన్ని వివరించారు.. నా తల్లి అత్యంత దుర్మార్గమైన వివాహాన్ని ఎదుర్కొంది. తన భార్యను కొట్టడం, పిల్లలను కొట్టడం, తన ఏకైక కుమార్తెను లైంగికంగా వేధించడం తన జన్మహక్కుగా భావించే వాడని తన తండ్రి గురించి తెలిపింది. నాపై వేధింపులు ప్రారంభమైనప్పుడు నాకు 8 ఏళ్లు, నాకు 15 ఏళ్ల వయసులో అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వచ్చిందని ఖుష్బు చెప్పింది.