Parawada Pharma City: ప్రైమ్9 ఎఫెక్ట్, తాడి గ్రామం తరలింపు

Parawada Pharma City: కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న పరవాడ ఫార్మా సిటీలోని తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రైమ్9 ఛానెల్‌లో వరుస కథనాలు ప్రసారం చేయటంతో తాడి గ్రామాన్ని తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ సారధ్యంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రైమ్9 ఎఫెక్ట్‌తో తాడి గ్రామం తరలింపు సర్వే పనులు పునః ప్రారంభమయ్యాయి. ఎనిమిది బృందాలతో గ్రామంలో కుటుంబాలు ఎన్ని వున్నాయి? ఎంత మంది వున్నారు? ప్రత్యామ్నాయం ఏం కావాలి తదితర అంశాలపై సర్వే చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న మునగపాక ,సబ్బవరం, అచ్యుతాపురం, కోటపాడు, కసింకోట ,నర్సీపట్నం, ఇలా ఎనిమిది బృందాలను రెవిన్యూ సిబ్బందితో సర్వే మొదలుపెట్టారు. రెండు దశాబ్దాలుగా ఎదురు చూసిన సమస్య పరిష్కారానికి కృషి చేసిన ప్రైమ్9 ఛానెల్‌కు గ్రామప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.