Published On:

Basra IIIT Admissions: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌!

Basra IIIT Admissions: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌!

RGUKT 2025 Admissions Online: తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. యూనివర్సిటీ ఉపకులపతి గోవర్దన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి జూన్‌ 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జులై 4వ తేదీన ప్రొవిజినల్‌ ఎంపిక జాబితాను ప్రకటించి, జులై 7వ తేదీన తొలి దశ కౌన్సెలింగ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన సమాచారాన్ని తమ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.

 

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులు ఆర్జీయూకేటీ బాసర 1500 సీట్లు, మహబూబ్‌నగర్‌ 180 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈ సెంటర్లలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడమే లక్ష్యంగా ఆర్జీయూకేటీలను 2008లో ప్రారంభించినట్లు వీసీ గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు.

 

దరఖాస్తు ఎలా..?

స్టెప్‌ 1 : మొదట ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారం నింపాలి. తర్వాత అన్ని వివరాలతో దరఖాస్తు సబ్‌మిట్‌ చేశాక అప్లికేషన్‌ ఐడీ వస్తుంది.

స్టెప్‌ 2 : దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

స్టెప్‌ 3 : అప్లికేషన్‌ను ప్రింట్‌ తీసుకోవాలి.

స్టెప్‌ 4 : పీహెచ్‌/సీఏపీ/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులు అయితే తమ ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారాన్ని పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తు రుసుం : ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ/ఎస్టీలకు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1500

 

-భర్తీకాని గ్లోబల్‌ కేటగిరీ సీట్లకు తెలంగాణ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రూ.1500 చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

-ఎన్నారై/ఇంటర్నేషనల్‌ అభ్యర్థులు అయితే 100 డాలర్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

-దరఖాస్తు ఫీజు టీఎస్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్లలో చెల్లించాలి. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు ఎవరైనా చేస్తే, నూతనంగా చేసిన

వాటినే   పరిగణిస్తారు.

-దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను జూన్‌ 25లోగా స్పీడ్‌పోస్టు/రిజిస్టర్‌ పోస్టు ద్వారా (ది కన్వీనర్‌, యూజీ అడ్మిషన్స్‌ 2025-26,   ఆర్జీయూకేటీ -బాసర, నిర్మల్‌ జిల్లా, తెలంగాణ- 504107) పంపాలి.

 

ఇవి కూడా చదవండి: