Rahul Gandhi: 50 ఏళ్ల వయసులో పబ్లిగ్గా పాండవులు సోదరిని ముద్దుపెట్టుకుంటారా? .. రాహుల్ గాంధీకి యూపీ మంత్రి ప్రశ్న
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ను కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ 50 ఏళ్ల వయస్సులో బహిరంగ సభలో తన సోదరిని ఏ పాండవుడు ముద్దు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ను కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ 50 ఏళ్ల వయస్సులో బహిరంగ సభలో తన సోదరిని ఏ పాండవుడు ముద్దు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు. ఇటీవల భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్, ప్రియాంకలు ఒకే వేదికపై కూర్చుని ఉండగా రాహుల్ తన చెల్లెలును అప్యాయంగా ముద్దాడారు.
పాండవులు అలా చేస్తారా?
ఒక సంఘ్ ప్రచారక్ పెళ్లిచేసుకోకండా , దురాశ లేకుండా దేశ నిర్మాణానికి అంకితమవుతానని ప్రమాణం చేస్తాడు” అని సింగ్ తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ‘కౌరవులు’ అని రాహుల్ గాంధీ ప్రస్తావించడం అతను తాను పాండవుడిని అని భావిస్తున్నారా? రాహుల్ గాంధీ 50 ఏళ్ల వయసులో చేసినట్లుగా, పాండవులు తమ సోదరిని బహిరంగంగా ముద్దు పెట్టుకున్నారా?” సింగ్ ప్రశ్నించారు.ఇది మన సంస్కృతి కాదు ఎందుకంటే భారతీయ సంస్కృతి అలాంటి వాటికి అనుమతించదు” అని ఆయన అన్నారు.
2024లో సోనియా ఓడటం ఖాయం
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గంనుంచి సోనియాగాంధీపై బీజేపీ అభ్యర్దిగా దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేసి ఓడిపోయారు. సోనియాగాంధీ రాయ్ బరేలీ సందర్శనకు ఎపుడూ రారని తనకు అనారోగ్యం అని తప్పించుకుంటారని ఆయన అన్నారు. అయితే తన కుమారుడి భారత్ జోడో యాత్ర’లో అతనితో కలిసి నడుస్తూ కనిపిస్తుంది. 2024లో ఆమె ఎంపీగా గెలవదు. సోనియా రాయ్‌బరేలీ నుండి నిష్క్రమించే చివరి విదేశీయురాలు అవుతుందని ఆయన అన్నారు. సోనియా గాంధీ విదేశీయురాలు కాదని చెప్పగలరా? ఆమె విదేశీయురాలు కాబట్టి ఆమెకు ప్రధాని పదవిని నిరాకరించారు. . భారతీయులు ఏ విదేశీయుని పాలకుడిగా అంగీకరించరని సింగ్ అన్నారు.
హర్యానాలో భారత్ జోడో యాత్ర సాగుతుండగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు 21వ శతాబ్దపు కౌరవులు అని అభివర్ణించారు. కొంతమంది ఖాకీ నిక్కర్లు, కర్రలు పట్టుకుని మన మధ్య తిరుగుతుంటారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు వీరి ఇష్టానుసారం అమలయ్యాయని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
Ram Charan-Upasana: సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..
RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”
Bangalore: 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసిన విమానం.. ఎక్కడో తెలుసా?
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/