Digital payments: ఆగస్టు 1 నుంచి పోస్టాఫీసుల్లో డిజిటల్ పేమెంట్స్

Post office: ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరించనున్నారు. పోస్టల్ విభాగంలో ఐటీ కొత్త మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, డిజిటల్ చెల్లింపులకు వీలు అవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం పోస్టాఫీస్‌లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థతో అనుసంధానం కాలేదు. ఈ నేపథ్యంలో డైనమిక్ క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు నిర్వహించేలా కొత్త అప్లికేషన్‌ను తీసుకొస్తున్నామని అధికారులు తెలిపారు. ఆగస్టు 1 నాటికి అన్ని పోస్టాఫీసుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఐటీ 2.0 కింద ప్రయోగాత్మకంగా కర్ణాటక సర్కిల్‌లో డిజిటల్ పేమెంట్స్ స్వీకరణ ప్రారంభమైంది.