Parag Jain: రా కొత్త చీఫ్‌గా పరాగ్ జైన్ నియామకం.. జులై 1న బాధ్యతలు

Parag Jain Appointed as New RAW Chief: ‘రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్’ (రా) కొత్త చీఫ్‌గా పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ నియమితులయ్యారు. ప్రస్తుత చీఫ్ రవి సిన్హా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. తదుపరి రా చీఫ్‌గా పరాగ్ జైన్‌ను నియమిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1న పరాగ్ జైన్ రా చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేండ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.
పరాగ్ జైన్ 1989 బ్యాచ్ పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌లో హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయన్ను రవి సిన్హా స్థానంలో రా కొత్త చీఫ్‌గా మోదీ ప్రభుత్వం నియమించింది. పాక్‌పై ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పరాగ్ జైన్ కీలక పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందించడంలో కృషిచేశారు. జమ్ము కశ్మీర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో పరాగ్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.