Cockroach in Srisailam Laddu: శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక

Cockroach in Srisailam Laddu: శ్రీశైలం లడ్డు ప్రసాదంలో బొద్దింక ప్రత్యక్షం అయ్యింది. ఆలయానికి వచ్చిన ఓ భక్తుడు లడ్డు కొనుగోలు చేసి, దానిని తినడానికి ప్రయత్నించగా అందులో బొద్దింక కనిపించింది. దీంతో భక్తుడు ఇదేంటని అక్కడనే ఉన్న అధికారులను నిలదీయడంతో సమాధానం చెప్పకుండా.. లడ్డూను అతడి చేతిలో నుంచి లాక్కునే ప్రయత్నం చేశారని పలువురు భక్తులు ఆరోపించారు. అక్కడ ఉన్న భక్తులు అంతా లడ్డూలో బొద్దింక రావడం ఏంటని కౌంటర్ వద్ద ఆందోళన చేశారు.
శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందనే విషయాన్ని శ్రీశైలం ఆలయ ఈఓ శ్రీనివాసరావు ఖండించారు. శ్రీశైలంలో లడ్డు ప్రసాదం తయారీ విభాగంలో శుచి, శుభ్రత పాటిస్తూ.. లడ్డూ తయారు చేస్తామని ఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. లడ్డు తయారీ కేంద్రం వద్ద నిరంతరం సిబ్బంది పర్యవేక్షణలో లడ్డు తయరీ జరుగుతుందన్నారు. లడ్డు ప్రసాదంలో ఏమాత్రం బొద్దింక వచ్చే అవకాశం లేదని ఈఓ శ్రీనివాసరావు చెప్పారు. శ్రీశైలం మల్లన్న లడ్డు ప్రసాదం విషయంలో భక్తులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని ఈఓ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.