Published On:

Konda Murali: కొండా మురళి వివాదంపై పీసీసీ సీరియస్

Konda Murali: కొండా మురళి వివాదంపై పీసీసీ సీరియస్

pcc mahesh kumar goud: వరంగల్‌ కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతోంది. కొండా మురళి వ్యవహారంపై జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేల మీటింగ్ అనంతరం కొండ మురళికి వ్యతిరేకంగా MLC సారయ్య లేఖను విడుదల చేశారు. కొండా మురళి క్రమ శిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. పార్టీని దెబ్బతీసేలా మాట్లాడి.. ఇప్పుడు అసలు విషయం తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. కొండా మురళి మారని పార్టీ లేదని.. అవకాశాన్ని బట్టి పార్టీలు మారడం.. వ్యక్తులను, లీడర్లను దూషించడం పరిపాటే అని బస్వరాజు సారయ్య మండిపడ్డారు.

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు, కొండా మురళి వివాదంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ మేరకు చిట్‌చాట్‌లో పలు వ్యాఖ్యాలు చేశారు. వరంగల్‌ నేతల గొడవపై రిపోర్ట్ తెప్పించుకున్నామన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే జులై 4న హైదరాబాద్‌కు రానున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. 4వ తేదీ ఉదయం 11గంటలకు పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

 

అయితే… ఆర్యవైశ్యల ఆత్మీయ సమ్మేళనంలో కొండా మురళీ హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని చెప్పారు. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనని అన్నారు. తనకు 500 ఎకరాల భూమి ఉంది.. గత ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మానని కొండా మురళి తెలిపారు. తన 45 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డానని కొండా మురళి అన్నారు.

 

ఇవి కూడా చదవండి: