Pakistan: తీరుమారని మునీర్.. ఉగ్రవాదులు అమరవీరులట..! భారత్ అన్యాయంగా దాడిచేసిందట.!

Pakistan Asim Munir: కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తులకు బహిరంగంగా మద్దతు ఇచ్చేలా మాట్లాడారు. ఉగ్రవాదులను అమరవీరులుగా అభివర్ణిస్తూ, కశ్మీర్‌లోని ఉగ్ర వాదాన్ని చట్టబద్ధమైన పోరాటంగా అభివర్ణించారు. భారతదేశంపై దాడికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు.
కరాచీలోని పాకిస్తాన్ నావల్ అకాడమీలో మునీర్ మాట్లాడుతూ.. ఎటువంటి రెచ్చగొట్టే చర్యలు లేకపోయినా భారత్ తమపై రెండుసార్లు దాడి చేసిందని మునీర్ అన్నారు. భవిష్యత్తులో భారతదేశం చేసే ఏదైనా దురాక్రమణకు నిర్ణయాత్మక ప్రతిస్పందనను ఇస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అనిచిసే స్థితిలో ఉందని ఆయన అన్నారు. పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని అందుకే చాలా ఉన్నతంగా బదులిచ్చిందని పలికారు.
మునీర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పహల్గాం ఉగ్రదాడికి పరిగ్గా 5 రోజుల ముందు కశ్మీర్ పాకిస్తాన్ కు జీవనాడని అన్నారు. పాకిస్తాన్ లో ఎప్పటికైనా కశ్మీర్ భాగమని అందుకోసం పోరాడే వారికి తమ సపోర్ట్ ఉంటుందని వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు అంతలోనే పహల్గాం దాడి జరిగింది. దీంతో భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టి దాదాపు 8 కీలక మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ కూడా ఉంది.