Published On:

Anchor Swetcha: పూర్ణచందర్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Anchor Swetcha: పూర్ణచందర్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

Poornachander Remanded for 14 Days: టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చారు. పూర్ణచందర్‌కు జడ్జి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పూర్ణచందర్ కన్ఫషన్ స్టేట్మెంట్‌లో సంచలన విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. కన్ఫషన్ స్టేట్మెంట్‌లో రాజకీయ నాయకుడి పేరు వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు ఒక రాజకీయ నాయకుడికి తెలుసని పూర్ణచందర్ చెప్పినట్లు సమాచారం.

 

తనను ఏమి చేయలేవు స్వేచ్ఛ అంటూ బెదిరించినట్లు సమాచారం. స్వేచ్చను భర్తతో విడాకులు తీసుకోమని చెప్పి, వివాహం చేసుకుంటానని పూర్ణ మోసం చేసినట్లు తెలుస్తోంది. పూర్ణచందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చింది స్వేచ్ఛ.. తర్వాత పలుమార్లు వివాహం చేసుకోవాలని నిలదీసింది స్వేచ్ఛ.. వివాహం ప్రస్తావనను దాట వేస్తూ వచ్చిన పూర్ణచందర్.. వారం రోజుల కింద అరుణాచలం వెళ్లారు. మూడు రోజుల కింద హైదరాబాద్‌కు స్వేచ్ఛ పూర్ణచందర్ వచ్చారు.

 

అరుణాచలం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వివాహం విషయంపై ఇద్దరి మధ్య మరో సారి గొడవ జరిగింది. పూర్ణచందర్ వివాహం చేసుకోనని తేల్చి చెప్పినట్లు విచారణలో వెలుగుచూసినట్లు సమాచారం. తనను చేయలేవు.. తనకు రాజకీయ అండ దండలు ఉన్నాయని పూర్ణచందర్ బెదిరించినట్లు తెలుస్తుంది. స్వేచ్ఛతో రిలేషన్‌లో ఉన్న విషయం రాజకీయ నాయకుడికి తెలుసని పూర్ణచందర్ చెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి: