Last Updated:

Bike Ambulances: బైక్ అంబులెన్స్‌లు.. కొండ కోనల్లో కూడా దూసుకుపోతున్నాయి.. ఎక్కడంటే?

గిరిజన సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలు మరియు సంరక్షణను అందించడానికి మహారాష్ట్రలోసమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (ITDP)‘బైక్ అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టింది.

Bike Ambulances: బైక్ అంబులెన్స్‌లు.. కొండ కోనల్లో కూడా దూసుకుపోతున్నాయి.. ఎక్కడంటే?

Bike Ambulances: గిరిజన సమాజానికి మెరుగైన ఆరోగ్య సేవలు మరియు సంరక్షణను అందించడానికి మహారాష్ట్రలో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (ITDP)‘బైక్ అంబులెన్స్’ సేవలను ప్రవేశపెట్టింది.

ఈ ప్రాజెక్ట్‌ను గడ్చిరోలి అసిస్టెంట్ కలెక్టర్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ITDP) ప్రాజెక్ట్ ఆఫీసర్ శుభం గుప్తా ప్రారంభించారు .

ఈ సందర్బంగా గుప్తా మాట్లాడుతూ, మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలిని అభివృద్ధి చేయడం, ప్రతి పౌరుడి హక్కు అయిన ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడం ఈ ప్రాజెక్ట్ వెనుక ప్రధాన లక్ష్యం అని అన్నారు.

రహదారి కనెక్టివిటీ లేని మారుమూల కుగ్రామాల నుండి చికిత్స కోసం ఉప కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (PHC) కేంద్రాలకు రోగులను తరలించివారిక ఆరోగ్య సంరక్షణను అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

స్థానిక ఆశా వర్కర్లతో కలిసి బైక్ అంబులెన్స్లు పనిచేస్తాయన్నారు.

బైక్ అంబులెన్స్‌లో సాధారణ వ్యాధుల చికిత్సకు ప్రాథమిక మందులతో కూడిన మెడికల్ కిట్‌లు ఉంటాయి.

అంతే కాకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటాయి. మొదటి సంవత్సరం ఇంధన ఖర్చులు, డ్రైవర్ల జీతాలు మరియు ఇతర ఖర్చులను ఐటిడిపి భరిస్తుంది.

జిల్లా పరిషత్ రెండో సంవత్సరం నుంచి ప్రాజెక్టును చేపడుతుందని గుప్తా తెలిపారు.

నాలుగు చక్రాల అంబులెన్స్ కొండ ప్రాంతాలకు వెళ్లడం లేదా ఇరుకైన రోడ్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లడం కష్టం.

కానీ బైక్ అంబులెన్స్‌లు అలాంటి ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు సౌకర్యం, అటవీ ప్రాంతం సరిగా లేకపోవడంతో ప్రజలు వైద్యాన్ని పొందేందుకు కిలీమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం గిరిజనల చెంతకు ఆరోగ్య సేవలను అందించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది.

భద్రతా దళాల కోసం ‘రక్షిత’ బైక్ అంబులెన్స్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్ (INMAS), డీఆర్డీవో ‘రక్షిత’ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశాయి.

మెడికల్ ఎమర్జెన్సీ లేదా యుద్ధంలో గాయాలబారిన పడిన భద్రతా దళ సిబ్బందిని అత్యవసరంగా తరలించడానికి వీటిని ఉపయోగిస్తారు.

ఈ బైక్‌లు ఎన్‌కౌంటర్‌ల సమయంలో ఏదైనా గాయాలు అయినప్పుడు సీఆర్పీఎఫ్ జవాన్లకు సహాయం అందిస్తాయి.

బీజాపూర్, సుక్మా, దంతేవాడ తదితర ప్రాంతాల్లో ఈ బైక్‌లు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.

ఎందుకంటే అడవిలోకి పెద్ద వాహనాలు లేదా అంబులెన్స్‌లను తీసుకెళ్లడం కష్టంగా ఉంటుంది.

నక్సలైట్ జోన్లలోని ఇరుకైన రోడ్లపైకి ఈ బైక్‌లు వేగంగా చేరుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన తర్వాత ఈ బైక్‌ను అభివృద్ధి చేశారు.

రేడియేషన్, న్యూరోకాగ్నిటివ్ ఇమేజింగ్ మరియు పరిశోధనలకు సంబంధించి బయోమెడికల్ మరియు క్లినికల్ రీసెర్చ్‌లో INMAS పనిచేస్తుంది.

ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) క్రింద పనిచేస్తుంది, ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పరిశోధన మరియు అభివృద్ధి (R&D) విభాగం.

ఏపీలో 1500 బైక్ అంబులెన్స్ లు

ఆంధ్రప్రదేశ్ లో 7 ఐటీడీఏల పరిధిలో 1,503 ప్రాంతాలకు బైక్‌ అంబులెన్స్‌ల సౌకర్యం కల్పించారు.

కాకినాడ జేఎన్‌టీయూకు చెందిన నిపుణులు ఈ బైక్‌ అంబులెన్స్‌కు రూపకల్పన చేశారు.

రెండు చక్రాల బైక్‌కు వెనుక భాగంలో రోగిని కూర్చోబెట్టి తీసుకెళ్లేలా ప్రత్యేకంగా సిట్టింగ్‌ (తొట్టె) ఏర్పాటు చేశారు.

దీనిని పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/