Bhim Army : భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. కాల్పులు జరిపిన దుండగులు
ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు
Bhim Army : ఆజాద్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కాగా చంద్రశేఖర్ ఆజాద్ కి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘాతనలో తీవ్రంగా గాయపడ్డ ఆజాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆజాద్ పరిస్థితి బాగానే ఉందని.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
దళిత నాయకుడు చంద్రశేఖర్‌పై కాల్పుల ఘటనతో యూపీలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఎటాక్ చేసిన వారిని తన అనుచరులు గుర్తించారని ఆయన చెప్పారు. అయితే బహుజన శక్తిని అడ్డుకునే కుట్రలో భాగంగానే తనపై దాడి జరిగి ఉండవచ్చన్నారు చంద్రశేఖర్ ఆజాద్. భీమ్ ఆర్మీచీఫ్ కార్యకర్తలు సహనం పాటించాలని సూచించారు. తుపాకులతో పోరాడే సంస్కృతి మనది కాదని, అందరూ శాంతి పాటించాలని కోరారు. కాగా, కాల్పులు జరిగిన సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు.
దుండగులు హర్యానా లైసెన్స్ నెంబర్ ప్లేట్ కలిగిన కారులో వచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో అజాద్ టయోటా ఫార్చ్యునర్ కారులో ప్రయాణిస్తున్నారు. కారులోని సీటు, డోర్ పై బుల్లెట్ తగిలినట్లు గుర్తించిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గరికి భీమ్ ఆర్మీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని ఆయనను చూసేందుకు యత్నిస్తున్నారు.