Army man Sonu Singh: షాకింగ్! టీటీఈ రైలు నుంచి తోసేయడంతో మరణించిన ఆర్మీ జవాన్
ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద టీటీఈ రైలు నుంచి నెట్టడంతో కిందపడిన ఆర్మీ జవాన్ మరణించాడు. నవంబర్ 17న జరిగిన ఈ సంఘటనలో గాయపడిన జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Bareilly: ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద టీటీఈ రైలు నుంచి నెట్టడంతో కిందపడిన ఆర్మీ జవాన్ మరణించాడు. నవంబర్ 17న జరిగిన ఈ సంఘటనలో గాయపడిన జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడిని ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన 31 ఏళ్ల సోను సింగ్‌గా గుర్తించారు. సుబేదార్ హరేంద్ర కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు టీటీఈ సుపాన్ బోర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
జైపూర్‌లోని రాజ్‌పుత్ బెటాలియన్‌లో పనిచేస్తున్న సోను సింగ్ ను నవంబర్ 17న బరేలీ జంక్షన్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 పై టీటీఈ నెట్టడంతో పడిపోయాడు. దిబ్రూఘర్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోమ ఢిల్లీకి వెడుతున్న సోను ఉదయం 9.15 గంటలకు వాటర్ బాటిల్ తీసుకురావడానికి బరేలీ స్టేషన్‌లో రైలు నుండి దిగాడు. తరువాత రైలు ఎక్కుతండగా టీటీఈ బోర్ అతడిని బయటకు తోసేయడంతో సోను ఒక కాలు తెగిపోయిందని, మరో కాలు బాగా నలిగిపోయిందని సుబేదార్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.అంతకుముందు, టికెట్ విషయంలో వారి మధ్య వాగ్వాదం చెలరేగడంతో కోపంతో బోర్ ఆర్మీ జవాన్ ను నెట్టివేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
డాక్టర్లు సోనూ సింగ్‌కు సైనిక ఆసుపత్రిలో మూడు శస్త్రచికిత్సలు చేశారు.కానీ సోమవారం, అతని తీవ్రంగా దెబ్బతిన్న కాలు కూడా తొలగించవలసి వచ్చింది.అతను బుధవారం సాయంత్రం మరణించాడని పోలీసులు తెలిపారు.ఈ సంఘటన జరిగిన తరువాత టీటీఈ బోర్ పరారీలో ఉన్నాడని, అతడిని అరెస్ట్ చేసేందుకు నాలుగు బృందాలను రప్పించామని వారు తెలిపారు. అతడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.