Gautam Adani: 3వ స్థానం నుంచి 30వ స్థానంకు అదానీ.. రూ. 12లక్షల కోట్ల సంపద ఆవిరి!
Gautam Adani: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు.
Gautam Adani: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది. ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో ఉన్న అదానీ.. హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావంతో ప్రస్తుతం 30వ స్థానానికి చేరుకున్నారు. రోజురోజుకు అదానీ సంపద తగ్గిపోతుండటంతో.. 30వ స్థానానికి చేరుకున్నాడు.
సంపన్నుల జాబితా నుంచి ఔట్.. (Gautam Adani)
హిండెన్‌బర్గ్ నివేదికల ప్రభావంతో.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ప్రస్తుతం 30వ స్థానానికి పడిపోయారు. హిండెన్‌బర్గ్ నివేదిక.. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు.. పంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదానీ.. నెల రోజుల వ్యవధిలో 30వ స్థానానికి పడిపోయారంటే ఆ నివేదిక ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. యూఎస్ కు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ అదానీ అక్రమాలకు పాల్పడ్డారంటూ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదికతో అదానీ వ్యాపార సామ్రాజ్యం ఒడిదొడుకులకు లోనైంది. దీని ప్రభావం.. దేశ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. హిండెన్‌బర్గ్ ఆరోపణలు సరైనవి కావని.. అదానీ గ్రూప్ ఆరోపించింది. అయినా సరే.. ఆ సంస్థ నష్టాలు ఆగలేదు. అదానీకి చెందిన వివిధ కంపెనీల సంపద దాదాపు రూ.12లక్షల కోట్లు ఆవిరై పోయినట్లు తెలుస్తోంది.
భారీ నష్టాలను చూస్తున్న అదానీ సంస్థ..
అదానీ గ్యాస్ లిమిటెడ్ మార్కెట్ విలువ నెలరోజుల్లో 80.68శాతం పడిపోగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ 74.62శాతం మేర నష్టపోయింది. జనవరి 24 నుంచి ఇప్పటివరకు అదానీ ట్రాన్స్ మిషన్ విలువ 74.21శాతం నష్టపోయింది. అదానీ విల్మర్, అదానీ పవర్, సిమెంట్ యూనిట్స్, ఇతర వ్యాపారాల మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది. హిండెన్ బర్గ్ నివేదికకు ముందు.. 120 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న అదానీ.. ఏకంగా 80.6బిలియన్ల సంపదను కోల్పోయారు. ముకేశ్ అంబానీ ఆసియాలో మూడో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. అయితే ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 10స్థానంలో ఉన్నారు.
వికీపీడియాను మార్చారని ఆరోపణ
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ మరోసారి వివాదాల్లో నిలిచింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక సృష్టించిన ప్రకంపనలు మరవక ముందే.. మరో వివాదం అదానీని వెంటాడుతోంది. వికీపీడియాలో ఉన్న సమాచారాన్నీ తారుమారు చేశారన్న విషయం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. గౌతమ్ అదానీతో పాటు.. గ్రూప్ కంపెనీలకు సంబంధించిన సమాచారన్ని ఏకపక్షంగా మార్చారాని వీకిపీడియా ఆరోపించింది. సమాచార మార్పు కోసం.. సాక్ పప్పెట్ ఖాతాలను, పెయిడ్ ఎడిటర్లను వినియోగించారని తెలిపింది. కంటెంట్‌లో మార్పు చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులు సైతం ఉన్నారని తెలిసింది. ఈ వివరాలను.. వికీపీడియాకు చెందిన ది సైన్ పోస్ట్ కథనం ప్రచురించింది.
సమాచారం మార్చివేశారు..
అదానీ గ్రూపుతో పాటు.. ఆయన కుటుంబ సభ్యుల వివరాలు, వ్యాపారాలకు సంబంధించిన వివరాలను తారుమారు చేశారని వికీపీడియా ప్రధాన ఆరోపణ. మార్చిన సమాచారం మెుత్తం.. అదానీకి అనుకూలంగా ఉందన్నట్లు పేర్కొంది. అదానీకి సంబంధించిన సమాచారం.. 2007 నుంచి ఉందని.. 2012లో ముగ్గురు ఎడిటర్లు దానికి సంబంధించిన సమాచారంలో మార్పులు చేశారని తెలిపింది. వార్నింగ్ టెక్స్ట్ ను సైతం తొలగించారని వివరించింది. దాదాపు ఇలా 9 ఆర్టికల్స్‌ను మార్చినట్లు పేర్కొంది. సమాచారాన్ని మార్చిన వారిలో.. అదానీ గ్రూప్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలిసింది. కంటెంట్ మెుత్తం.. అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్ నుంచే జరిగిందని కథనంలో ప్రచురించింది. వికీపీడియా క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్‌కు సైతం దొరక్కుండా వాటిని మార్చినట్లు తెలిపింది. ఆర్టికల్స్ రివ్యూయర్ ని ఆ తర్వాత తొలగించామని తెలిపింది. సమాచార మార్పులో అవినీతి జరిగి ఉంటుందని కథనంలో పేర్కొంది. వికీపీడియాలో వచ్చిన ఈ కథనాన్ని నాథన్ ఆండర్సన్ ట్వీట్ చేశారు. వికీపీడియాను సైతం మార్చారంటూ ఆయన పేర్కొన్నారు.