Published On:

Accident: చంచల్ గూడ సర్కిల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి

Accident: చంచల్ గూడ సర్కిల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి

Hyderabad: చంచల్ గూడ సర్కిల్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా వచ్చిన కారు మూల మలుపు వద్ద బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న భార్యాభర్తతో పాటు వారి రెండేళ్ల పాప కింద పడిపోయారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన సీమా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త, కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

 

అయితే బైక్ ను వేగంగా ఢీకొట్టిన కారు వేగంగా దూసుకెళ్లి డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది. కారు నడిపిన వ్యక్తిని మాదన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.