Home / miss world 2025 hyderabad
Miss World 2025 crowned Winner Thailand Miss Opal Suchata: 72వ మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్‌కు చెందిన సుందరీ ఓవల్ సుచాత చువాంగ్శ్రీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు రూ.8.2కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ఈ పోటీల్లో టాప్ 4 విషయానికొస్తే.. మార్టినక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్‌లాండ్ దేశాల అందగత్తెలు నిలిచారు. ఇందులో ఓవల్ సుచాత చువాంగ్శ్రీ మాత్రం అడిగిన ప్రశ్నలకు అత్యుత్తమ సమాధానం చెప్పి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. మిస్ […]
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ ఇవాళ అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. కాగా, ఈ పోటీలు గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మే 10వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక, ఈ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా 110 దేశాల భామలు పోటీ పడుతుండగా.. 150కు పైగా దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇందులో మిస్ ఇండియా నందిని గుప్తా కూడా ఉండడం విశేషం. […]
Miss World Grand Final – 2025 In Hyderabad: హైదరాబాద్‌తో మిస్ వరల్డ్ – 2025 గ్రాండ్ ఫైనల్స్ శనివారం జరగనున్నాయి. ఈ మేరకు నగరంలోని హైటెక్స్ వేదిక అంగరంగవైభవంగా ముస్తాభైంది. ఈ పోటీలను మొత్తం 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పోటీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై తిలకించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, ఈ పోటీల్లో […]
Miss England Milla Magee withdraws from competition: హైదరాబాద్‌లో జరుగుతోన్న 72వ ప్రపంచ సుందరీమణుల పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ -2025 మిల్లా మాగీ వైదొలిగింది. దీంతో మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటీష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్ ఇంగ్లాండ్ మాగీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ నెల […]
Miss World 2025 Contestants Visit Telangana Secretariat : ప్రపంచ సుందరీమణులు ఆదివారం తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్లో గ్రూప్ ఫొటో దిగారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా అద్భుతమైన సచివాలయాన్ని చూసి ఆశ్చర్య వ్యక్తం చేశారు. కంటెస్టెంట్లు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ టూరిజం అభివృద్ధి : మంత్రి జూపల్లి సచివాలయంలో […]
Secretariat : రాష్ట్ర సచివాలయం సమీపంలో వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 72వ ప్రపంచ సందరీమణుల పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతంలో జాతీయ జెండా తొలగింపు తీవ్ర కలకలం రేపుతోంది. జకీర్ అనే యువకుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఇజ్రాయెల్ జెండాను తొలగించాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో […]
Miss World : ప్రపంచ సుందరీమణులు ఇవాళ సాయంత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గెస్ట్‌హౌస్ నుంచి బ్యాటరీ వాహనాల్లో చేరుకొని అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందాల భామల వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు. అక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీసులు, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించారు. […]
Miss World 2025 @Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 72వ మిస్ వరల్డ్ పోటీలు 2025 అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సుమారు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి […]
Miss World 2025 Contest Starts from Today in Hyderabad: అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమిస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచసుందరి పోటీలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడులకను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ […]