Paper leakage : నాడిబార్‌ను రద్దుచేయండి.. హైకోర్టులో విద్యార్థిని పిటిషన్

Paper leakage : నకిరేకల్ పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విద్యార్థిని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి, నల్లగొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా విద్యార్థిని పేర్కొంది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన విద్యార్థిని పదో తరగతి పేపర్ లీకేజీలో వ్యవహారంలో డిబార్ కాగా, ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
రాజకీయ దుమారం..
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ ఘటన రాష్ట్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి నకిరేకల్ పీఎస్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. పదో తరగతి పరీక్షలో మాస్ కాపీయింగ్ నిందితులతో మున్సిపల్ చైర్మన్‌కు సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రజితాశ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై నకిరేకల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్‌పై నకిరేకల్ పీఎస్‌లో 2 కేసులు నమోదైయ్యాయి. కాంగ్రెస్ నాయకుడు ఉగ్గడి శ్రీనివాస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు.
పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన తీవ్ర కలకలం..
ఈ నెల 21న నకిరేకల్‌లో పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలోని 8వ నెంబర్ గది నుంచి తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు అధికారులు గుర్తించారు.
ఘటనపై వేగంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. ప్రశ్నపత్రం లీకేజ్ అవడానికి ఓ విద్యార్థిని కారణం అంటూ ఆమెను డిబార్ చేశారు. పేపర్ లీక్‌పై తనకు ఏ పాపం తెలియదని, ఓ వ్యక్తి కిటీకి వద్దకు వచ్చి పేపర్ చూపించాలని లేకపోతే రాయితో కొడతానని బెదిరించాడని.. అందువల్ల భయంతో పేపర్ చూపించినట్లు వాపోయింది. తనను డిబార్ చేయొద్దని పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని విద్యార్థిని వేడుకుంది.