Telangana Cabinet: రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. సాయంత్రంలోపు ప్రకటన
Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మూహుర్తం ఖరారైంది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణపై గుసగుసలు వినిపించినా.. చివరికి రేపు మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలోకి కొత్తగా ముగ్గురిని తీసుకోనున్నట్టు సమాచారం. ఈ మేరకు సాయంత్రంలోపు రాజ్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎంపికైన ఎమ్మెల్యేలకు సాయంత్రానికి సమాచారం పంపిస్తారని టాక్.
అయితే రేవంత్ టీమ్ లోకి కొత్తగా ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు మంత్రి పదవుల రేసులో పెద్ద సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. ఇక బీసీ కులాల నుంచి వాకిటి శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎస్సీ కేటగిరి నుంచి సీనియర్ నేతలు వివేక్, వినోద్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఎస్టీ విభాగం నుంచి బాలు నాయక్, రాము నాయక్ పేర్లు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. అలాగే ఎస్సీ కేటగిరీలో ఎక్కువగా మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ లో తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొత్తగా ఎవరికి అవకాశం వస్తోందో ఆసక్తి నెలకొంది.