Telangana BJP: కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలకు కిషన్ రెడ్డి కౌంటర్

Kishan Reddy Strong Counter to congress and brs about Telangana BJP President: తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఎంపికపై కాంగ్రెస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు.
బీజేపీ అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకోవాలో మీరు చెప్తారా? అని ప్రశ్నించారు. ఎవరిని ఎన్నుకోవాలనేది మా పార్టీ నిర్ణయమని, మీరెవరు చెప్పడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదులుతోందని, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న మీరా మా గురించి మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.