Last Updated:

Priyanka Gandhi : బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశన్నంటింది – ప్రియాంక గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు.

Priyanka Gandhi : బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో అవినీతి ఆకాశన్నంటింది –  ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా భువనగిరిలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి ఆకాశన్నంటిందన్నారు.

రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రియాంక ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా లేస్తుందని.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారని అన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ అవుతాయని.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అలాగే కొనసాగుతాయని మండిపడ్డారు. ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని.. యువత ఆశలపై కేసీఆర్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని.. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.

ప్రజలకు సాయం చేయాలన్న ఆలోచన బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మండిపడ్డారు. నిరుద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఉద్యోగులు రాలేదు. ఉపాధిలేదన్నారు. ఈ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీఆర్ఎస్ చేసిందేమి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భువనగిరి ప్రాంతంలోని ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారు. లంబాడీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోనియా గాంధీ ప్రజల పక్షాన ఉన్నారన్నారు. తెలంగాణ బిడ్డలు బాగుండాలని కోరుకున్నారని అందుకే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని తెలిపారు.

గులాబీ పార్టీ నేతలు విలాసవంతమైన భవంతుల్లో నివసిస్తున్నారని.. కానీ పేదలు మరింత పేదరికంలోకి వెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడుందన్నారు. రాజస్థాన్, చత్తీస్ గఢ్ మాదిరిగానే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అన్నదమ్మలు గా పనిచేస్తున్నాయని.. ఈ రెండు పార్టీలకు చిన్నతమ్ముడిగా ఎంఐఎం పార్టీ ఉందన్నారు. భువనగిరి నియోయోజకవర్గంలో అనిల్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.