CM Revanth Reddy: ఇళ్లులేని వారికి రూ.5 లక్షల సబ్సిడీ.. నేడే ఇందిరమ్మ ఇళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన

CM Revanth Reddy to lay Foundation for Indiramma Houses: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు శుక్రవారం మొదటి అడుగు పడనుంది. ఈ మేరకు నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాలోని ని అప్పకపల్లెలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో భాగంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. కాంగ్రెస్ సర్కార్ మంజూరు చేసిన ఇళ్ల పనులకు నేడు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. మొత్తం ఇంటి నిర్మాణానికి గాను ప్రభుత్వం రూ.5లక్షల వరకు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం చేయనుంది. కాగా, ఇందులో బేస్‌మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనున్నారు.
అలాగే, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన ముగిసిన నారాయణపేట జిల్లా పర్యటన చేయనున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఆయన జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ గుడిలో పూజా కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అప్పకపల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట గురుకుల హాస్టల్ ఆవరణలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగానే ఉదయం 11.30 నిమిషాలకు ఎయిర్ పోర్టు నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి 12 గంటలకు పోలేపల్లి వద్దకు చేరుకుంటారు. 12.10 నిమిషాల నుంచి 12.25 నిమిషాల వరకు పోలేపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు. అనంతరం 1.15 నిమిషాల వరకు జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 1.35 నిమిషాల నుంచి 2 గంటల వరకు అప్పకపల్లికి చేరుకుంటారు.