Last Updated:

PM Modi: కుటుంబ పాలనకు చెక్ పెడతాం: మోదీ

మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

PM Modi: కుటుంబ పాలనకు చెక్ పెడతాం: మోదీ

PM MOdi: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 జాతీయ రహదారులకు ఆయన శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ -మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించారు. మేడ్చల్, బొల్లారం, ఉందానగర్ కు ఎంఎంటీస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రిమోట్ ద్వారా శిలా ఫలకాలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

 

తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజం(PM Modi)

ఆ తర్వాత మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర, సోదరీమణులారా మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ‘కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాం. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చేశాం. తెలంగాణలె నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉంది. పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధికి కేంద్రం చేయూత ఇస్తోంది. దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోయే 7 మెగా టెక్స్ టైల్స్ పార్కులతో పాటు తెలంగాణలో కూడా మోగా టెక్స్ టెల్స్ పార్కు ఏర్పాుటు చేస్తున్నాం. కానీ, తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావడం లేదు. అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.

 

అందరూ నాపై పోరాటం చేస్తున్నారు: ప్రధాని

కేంద్రం ఎన్నో అభివృద్ది పనులు చేస్తుంటే తెలంగాణ సర్కార్ బాధపడుతోంది. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదు. ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు తీసుకుంటున్నాం. కుటుంబవాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలనుకున్నారు. వారి నియంత్రణను ఎవరూ కూడా ప్రశ్నించకూడదనుకుంటున్నారు. నిజాయితీగా పనిచేసే వారుంటే అవినీతిపరులకు భయం. దేశాన్ని అవినీతి నుంచి విముక్తి కలిగించాలా.. వద్దా? అవినీతి పరుల విషయంలో చట్టం తనపని తాను చేసుకోవాలా? వద్దా.. కుటుంబ పాలన నుంచి ఈ ప్రజలకు విముక్తి కలిగిస్తాం. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి. కోర్టుకు వెళ్లారు.. అక్కడా వారికి నిరాశే ఎదురైంది. వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్ కూడా లాక్కున్నారు. 80 కోట్ల మందికి నేడు ఉచితంగా రేషన్ అందిస్తున్నాం. ’ అని మోదీ వెల్లడించారు.

ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి తిరిగి బేగంపేటకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన చెన్నై బయలు దేరి వెళ్లారు. దీంతో హైదరాబాద్ లో ప్రధానీ మోదీ పర్యటన ముగిసింది.