Published On:

Netizens Fires on Natasha: ఫ్యాషన్ షోకు హార్దిక్ పాండ్య కొడుకు.. నటాషాను ఏకి పారేస్తున్న నెటిజన్లు

Netizens Fires on Natasha: ఫ్యాషన్ షోకు హార్దిక్ పాండ్య కొడుకు.. నటాషాను ఏకి పారేస్తున్న నెటిజన్లు

Netizen’s Fires on Hardik Pandya’s Ex Wife Natasha: నటాషా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడాకులు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె చేసిన తప్పు వల్లే పెద్దఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. కానీ, విమర్శలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. సెర్బియాకు చెందిన ఆమె నటాషా బాలీవుడ్‌లో సినిమాలు చేసి బాగా మంచి గుర్తింపు తెచ్చుకంది. ఆ క్రమంలోనే క్రికెటర్ హార్డిక్ పాండ్యతో లవ్‌లో పడి వివాహం చేసుకుంది. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఇద్దరూ విడాకుల తర్వాత తన కొడుకును తీసుకుని కొన్నాళ్లపాటు సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా. సెర్బియాలో చాలా ఏళ్లు ఉన్న తర్వాత రీసెంట్‌గా ఇండియాకు వచ్చింది. తాజాగా ముంబయిలో బాంబే టైమ్స్ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోకు ఆమె కొడుకును తీసుకుని వచ్చింది.

 

నటాషా ర్యాంప్ వాక్..
ముంబయిలో జరిగిన ఫ్యాషన్ షోలో ఆమె ర్యాంప్ వాక్ చేసింది. షోకు నటాషా బాయ్ ఫ్రెండ్ రూమర్డ్ అలెగ్జాండర్ వచ్చాడు. ఓ పక్క నటాషా ర్యాంప్ వాక్ చేస్తుండగా, హార్దిక్ పాండ్య కొడుకును అలెగ్జాండర్ ఆడిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారు ఆమెను తిట్టి పారేస్తున్నారు. ఫ్యాషన్ షోకు కొడుకును ఎందుకు తీసుకొచ్చావంటూ ఫైర్ అవుతున్నారు. నీ బాయ్ ఫ్రెండ్‌తో ఫ్యాషన్ షోకు వస్తావంటూ చురకలు అంటిస్తున్నారు. షోలో నటాషా మాట్లాడారు. తనకు తిరిగి సినిమాల్లో నటించాలని ఉందని, ఏమైనా ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటూ చెప్పింది.

 

 

ఇవి కూడా చదవండి: