Redmi Note 14 Pro+ 5G: ఇదెక్కడి ఆఫర్ రా బాబోయ్.. రెడ్‌మి కొత్త ఫోన్ ధర భారీగా తగ్గింది.. ఇప్పుడు చాలా చీపు!

Redmi Note 14 Pro+ 5G Price Dropped: Redmi Note 14 Pro+ 5G ధర భారీగా తగ్గింది. ఈ రెడ్‌మి ఫోన్ షియోమి సమ్మర్ సేల్‌లో ఇప్పటివరకు అత్యల్ప ధరకు లభిస్తుంది. రెడ్‌మి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని నెలల క్రితం లాంచ్ చేసింది. శక్తివంతమైన 6,200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన Redmi Note 13 Pro + 5G అప్‌గ్రేడ్ మోడల్. రండి.. ఈ రెడ్‌మి ఫోన్ ధర, అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Redmi Note 14 Pro+ 5G Offers
Redmi Note 14 Pro+ 5G మూడు స్టోరేజ్ వేరియంట్లలో విడుదలైంది – 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 512GB. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.30,999. అదే సమయంలో, దాని ఇతర రెండు వేరియంట్లు వరుసగా రూ. 31,999, రూ. 34,999 కు లభిస్తాయి. ధర తగ్గింపు తర్వాత ఈ రెడ్‌మి ఫోన్ ప్రారంభ ధర రూ.29,999కి జాబితా చేశారు. ఈ ఫోన్ కొనుగోలుపై అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా, మీరు ఈ రెడ్‌మి ఫోన్‌ను కేవలం రూ.27,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.
Redmi Note 14 Pro + 5G Features
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల పెద్ద 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఫోన్ డిస్ప్లే 120Hz హై రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, ఫోన్ డిస్‌ప్లే 3,000 నిట్స్ వరకు ఉంటుంది. ఈ రెడ్‌మి ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6,200mAh శక్తివంతమైన బ్యాటరీని అందించింది. ఈ ఫోన్‌లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్‌లో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 50MP మెయిన్ OIS కెమెరా అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా 50MP టెలిఫోటో, 8MP అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 20MP కెమెరా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- Vivo T4 5G Features Leaked: పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త వివో 5జీ ఫోన్.. 7,300mAh బ్యాటరీ.. లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్!