Last Updated:

CM KCR : గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్.. నెక్స్ట్ కామారెడ్డి కూడా !

తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. రేపటితో గడువు ముగియనుండగా మంచి రోజు కావడం వల్ల గురువారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

CM KCR : గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్.. నెక్స్ట్ కామారెడ్డి కూడా !

CM KCR : తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. రేపటితో గడువు ముగియనుండగా మంచి రోజు కావడం వల్ల గురువారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు.  ఇవాళ ఉదయం  గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి  గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారు.  అక్కడి నుండి తన వాహనంలో  ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి  నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ పత్రాలు  సమర్పించిన తర్వాత  కేసీఆర్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు.

మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించిన పత్రాలపై ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత సంతకాలు చేశారు. కేసీఆర్ నామినేషన్ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశాయి. నామినేషన్ అనంతరం కామారెడ్డిలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.