Published On:

KTR about Scam: త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతా: కేటీఆర్ సంచలన కామెంట్స్

KTR about Scam: త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతా: కేటీఆర్ సంచలన కామెంట్స్

BRS Working President KTR Comments on SCAM: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. 400 ఎకరాలు కాదని, దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని ఆరోపణలు చేశారు. కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని తెలిపారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని వెల్లడించారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తున్నారని, మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ కలిసి రేవంత్‌‌రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వదులుదామనుకున్న బాంబులు తుస్సుమన్నాయని, అందుకే సైలెంట్ అయిపోయాడంటూ ఎద్దేవా చేశారు.

 

తెలంగాణనలో నెగిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, లగచర్ల, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మూసీ విషయంలో ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో జంతువుల వ్యధకు కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థ జూపార్కు నివేదికలోనే జింకలు, నెమళ్లు ఉన్నట్లు చెప్పాయని కేటీఆర్ గుర్తుచేశారు. గంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టులను కూడా కాంగ్రెస్ సర్కారు తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.

 

హీరోలు సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు జింకలను చంపిన కేసులో జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. తెలంగాణలో జింకలను చంపిన వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 25 ఏళ్లు పూర్తయిన రెండో తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఇందులో భాగంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద బహిరంగ సభ కాబోతోందన్నారు. ఈసారి డిజిటల్ మెంబర్ షిప్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కార్యాలయాల్లో శిక్షణా తరగతులు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా తెలంగాణలో నెలకోసారి కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. వరంగల్ బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. తెలంగాణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల ప్రభావం పడనుందని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: