Last Updated:

Siddipet: తన చితి తానే పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య.. సిద్దిపేటలో హృదయవిదారక ఘటన

Siddipet: సిద్దిపేట జిల్లాలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు

Siddipet: తన చితి తానే పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య.. సిద్దిపేటలో హృదయవిదారక ఘటన

Siddipet: సిద్దిపేట జిల్లాలో హృద‌య విదార‌క ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన చితిని తానే పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అందరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. వంతుల వారిగా పోషించాలన్న కొడుకుల నిర్ణయం నచ్చలేక తనువు చాలించుకున్నాడు. ఈ ఘటన సిద్దపేట జిల్లా హుస్నాబాద్ లో వెలుగు చూసింది.

వంతుల జీవితం భారమై.. (Siddipet)

ఓ 90 ఏండ్ల వృద్ధుడు త‌న చితి తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్ప‌డ్డాడు. ఎందుకంటే వంతుల జీవితం బ‌త‌క‌డం ఇష్టం లేక ఆ వృద్ధుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండ‌లం పొట్ల‌ప‌ల్లిలో వెలుగు చూసింది. పొట్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వీరందరికి వివాహాలు జరిపించారు. వెంకటయ్య భార్య చాలా రోజుల క్రితమే కాలం చేశారు. ఇక నలుగురు కుమారులు కూలీ పనులు చేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. కుమారులకు పెళ్లిల్లు కాగానే.. ఆస్తిని సమానంగా పంపిణీ చేశాడు వెంకటయ్య. దీంతో వంతులవారీగా కన్నతండ్రిని పోషించాలని కుమారులు నిర్ణయించారు. వారి నిర్ణయంతో.. ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఊరికి వదిలివెళ్లలేక.. తన కొడుకులకు భారం కాకుడదని ఇంటి నుంచి వెళ్లిపోయారు.

పంచాయతీ నిర్ణయం..

వెంకటయ్య కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్‌లో, మరొకరు కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడిలో ఉంటున్నారు.

ఆయనకున్న నాలుగెకరాల భూమిని సమానంగా పంపిణీ చేశారు. వెంకటయ్య స్వంత గ్రామంలోనే వృద్ధాప్య పింఛనుతో కాలం గడుపుతున్నారు.

కొద్ది రోజులుగా గ్రామంలోనే ఉంటున్నాడు. అయితే పోషణ విషయంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది.

నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతులవారీగా పోషించాలని నిర్ణయించారు.

ఇది జీర్ణించుకోలేని వెంకటయ్య.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని అక్కడి వారికి చెప్పాడు.

సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆయన కోసం గాలించారు. అదే గ్రామంలో ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది.

ఆ మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించారు.

ఘటనాస్థలంలో తాటికమ్మలను ఒకచోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ మణెమ్మ తెలిపారు.