Last Updated:

MLC Elections: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కాసేపట్లో ప్రారంభం

MLC Elections: నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. కాసేపట్లో ప్రారంభం

Teacher MLC Election Counting Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన చెరో మూడు చొప్పున మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇవాళ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కు అధికారులు కరీంనగర్ ఇండోర్ స్టే డియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ లు ప్రఫుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహే శ్వర్ తో కలిసి కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పిజియన్ బాక్స్ లను, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాతుందని తెలిపారు. కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రాడ్యుయేట్ ఓట్లకోసం మొత్తం 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల కోసం 14 టేబుళ్ళు సిద్ధం చేస్తున్నట్లు ప్రక టించారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్, సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్ లలో విధులు నిర్వ హిస్తారని వెల్లడించారు.

అయితే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ధీమాను వ్యక్తం చే స్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు బలంగా చెబుతున్నాయి. టీచర్స్ ఎమ్మెల్సీ స్థా నానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా బీజేపీ నుంచి మల్క కొమరయ్య, పీఆర్టీయు అభ్యర్థిగా వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థిగా వై. అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పోటీ చేశారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓటుతోనే కొమ రయ్య గెలిచే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీచర్స్ ఓట్లు మొత్తం 27,088 కాగా 24,968 మంది టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ 92.17 శాతం నమోదు అయింది. టీచర్స్ ఎమ్మెల్సీగా గెలవాలంటే 12,485 ఓట్లు రావాల్సి ఉంటుంది. కాగా, తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. 50 శాతం ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఇలా జరగపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు.

ఈ నేపథ్యంలొనే పట్టభద్రుల ఎమ్మెల్నీ ఓట్ల లెక్కింపులో ద్వితీయ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేయడంతో జంబో బ్యాలెట్ వినియో గించారు. అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, బిజేపి నుంచి చిన్నమైల్ అం జిరెడ్డి, బిఎస్పీ అభ్యర్థిగా పులి ప్రసన్న హరికృ ష్ణగౌడ్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేశారు. మొత్తం ఓట్లు 3 లక్షల 55 వేల 159 మంది ఓటర్లు ఉండగా…. 2 లక్షల 50 వేల 328 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మును పెన్నడు లేని విధంగా ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ 70.48 శాతం నమోదు అయింది. పోలింగ్ భారీగా నమోదు కావడం అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో కౌంటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అధికా రులు భావిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ గా గెలువాలంటే ఒక లక్షా 25 వేల 165 ఓట్లు రావాలి… కానీ గెలిచేందుకు కావాల్సిన కోటా ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. రెండో ప్రాధాన్యత ఓటు కీలకంగా మారనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముందున్నా కావాల్సిన కోటా ఓట్లు రాకుంటే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతో ప్రసన్న హరికృష్ణ గెలిచే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే దానిపై అం దరిలోనూ ఉత్కంఠ నెలకొంది.