Home / MLC Elections
:ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఊహించని విజయాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి... 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైకాపా అధినేత, సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఈ నెల 13న ఏపీ లోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తెలంగాణలోని ఒక ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.
MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
MLC Election: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనిపై ప్రకటన విడుదల చేశారు. మిత్రపక్షం మజ్లిస్ అభ్యర్ధన మేరకు.. మద్దతు ప్రకటిస్తున్నట్లు భారాస వర్గాలు తెలిపాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.