Last Updated:

Sitarama Project: కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. బి.జి కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంప్ హౌస్ ను పరిశీలించారు.

Sitarama Project: కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

 Sitarama Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ విజయవంతం అయింది. బి.జి కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంప్ హౌస్ ను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలకు నీరందనుంది. మంత్రి సీనియర్‌ ఇరిగేషన్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపును స్విచాన్‌ చేశారు.

మూడు జిల్లాల ప్రజల కల సాకారం..( Sitarama Project)

వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయరుకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు.. 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఖమ్మం జిల్లాలో 4లక్షల ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 3 లక్షల ఎకరాలు, మహబూబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని మంత్రి ప్రకటించారు.ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ పంపు ట్రయల్‌ రన్‌తో ఈ ప్రాంత పరిధిలోని మూడు జిల్లాల ప్రజల కల సాకారమవుతుందని అన్నారు.సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద బిజి కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం మూడు పంప్‌హౌస్‌ల పనులను నెల రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ట్రయల్‌రన్‌ నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆగస్టు నెలలో ఎస్‌ఆర్‌ఎల్‌ఐపీ ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరు లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్‌కు గోదావరి నీటిని అందించాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి: