Last Updated:

Telangana : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా.. త్వరలోనే గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్‌లను విడుదల చేయనుంది.

Telangana : తెలంగాణ నిరుద్యోగులకు  గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

Telangana: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా.. త్వరలోనే గ్రూప్-2, 3, 4 పోస్టుల భర్తీకి సర్కార్ నోటిఫికేషన్‌లను విడుదల చేయనుంది. అయితే వీటిలో మరికొన్ని పోస్టులను చేర్చుతున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. గ్రూప్-2లో మరో ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్-3 మరో రెండు రకాల పోస్టులు, గ్రూప్-4లో మరో నాలుగు రకాల పోస్టులు చేర్చుతున్నట్టుగా బుధవారం (నవంబర్ 23) ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో జారీ చేసిన జీవో నెం. 55లో సవరణలు చేపినట్టుగా తెలిసింది.

గ్రూప్-2లో చేర్చిన పోస్టులు ఈ విధంగా ఉన్నాయి.1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ సర్వీసు)2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇతర శాఖలకు సంబంధించి)3. జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ 4. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్5. అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్6. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ లు ఉన్నాయి.అదేవిధంగా గ్రూప్-3లో 1. గిరిజ సంక్షేమ శాఖ అకౌంటెంట్, 2. సీనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్/అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. గ్రూప్-4లో 1. జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్2. జువైనల్ సర్వీసెస్ సూపర్‌వైజర్ (మేల్) (జువైనల్ సర్వీసెస్, డబ్య్లూసీడీ అండ్ ఎస్సీ వెల్పేర్ డిపార్ట్‌మెంట్)3. మ్యాట్రన్ కమ్ స్టోర్ కీపర్,4. మ్యాట్రన్ (కమిషన్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్) పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: