School Bus Kid Death: స్కూల్ వెళ్లిన తొలిరోజే చిన్నారి మృతి

School Bus Kid Death: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌కి వెళ్లిన తొలిరోజు ఐదేళ్ల చిన్నారి బస్సు కిందపడి మృతి చెందింది. ఆళ్లగడ్డలోని ఎంపీ నగర్‌లో నివాసం ఉంటున్న శ్రీధర్, వనజ దంపతుల కూతురు హరిప్రియ ఓ ప్రైవేటు స్కూల్‌లో LKG చదువుతుంది. నిన్న మొదటి సారిగా స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన ఆ చిన్నారి అమ్మను సంతోషంగా బస్సు దిగింది. బస్సులో చిన్నారిని చూసి తల్లి మురిసిపోయింది. కానీ కొద్దిసేపటికే అది విషాదంగా మారింది. కళ్ల ముందే చిన్నారి బస్సు టైర్ల కిందపడి నలిగిపోయింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్లముందే మరణించడంతో తల్లి అల్లాడిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.