Published On:

YS Jagan: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట.. విచారణ 2 వారాలకు వాయిదా

YS Jagan: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట..  విచారణ 2 వారాలకు వాయిదా

YS Jagan Singaiah death case: మాజీ సీఎం జగన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. దళితుడు సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. వైఎస్ జగన్‌ కాన్వాయ్‌ వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ వీడియోలను మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. ఘటన సమయంలో అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని ఆ నివేదిక తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం పోలీసులకు అందిన ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారింది.

 

జూన్‌ 18న పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జగన్‌ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయారు. వైసీపీ కార్యకర్తలు రోడ్డు పక్కకు లాగేసి వదిలేయడంతో ఆయన కొంతసేపటికి ప్రాణాలు కోల్పోయారు. సింగయ్య మృతి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే సంఘటనా స్థలంలో డ్రోన్, సీసీ ఫుటేజ్ లను సైతం పోలీసులు పరిశీలించారు. అయితే ర్యాలీని చిత్రీకరించిన వైసీపీ కార్యకర్తల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ విభాగానికి పంపించారు. ఇప్పటి వరకు 6 ఫోన్లలో తీసిన వీడియోలను పరిశీలించారు. అవన్నీ ఒరిజినల్‌ వీడియోలని స్పష్టమైంది.

 

మరోవైపు, సింగయ్య మృతి కేసు విషయంలో వైసీపీ నేతలు పోలీసులను తప్పుదోవ పట్టిస్తూ.. సమాచారం చేరవేసిన వారిపైనా అంతర్గత విచారణ జరుగుతోంది. జగన్ సహా వైసీపీ పలువురు నేతలపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగానే కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి: