Home / YCP leaders
పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు.
ఎంపీగా అవినాష్రెడ్డి విభజన చట్టంలో పేర్కొన్న కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు షర్మిల . హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
విశాఖపట్నంలో వైసీపీ అక్రమాలపై పోరాడితే జనసేన పార్టీ కార్పోరేటర్ మూర్తి యాదవ్ను చంపేస్తామని బెదిరించడం అధికార పక్షం నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రశ్నించడం, చట్ట ఉల్లంఘనలపై పోరాడటం ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు.
సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాలను కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. ఇప్పటికే అక్కడ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీ వేడీ విమర్శలు కనిపిస్తున్నాయి. ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసై వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
‘వీరసింహారెడ్డి’ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు హడావిడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు.
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 8 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్మాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.