Published On:

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు.. అరెంజ్ అలర్ట్

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరు వర్షాలు.. అరెంజ్ అలర్ట్

ఏపీ, తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెలంగాణలో మరో 5 రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిస్తాయని అంచనాల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

 

హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరికి వరద నీరు వచ్చి చేరింది. భారీ వరద నీరు వస్తుండడంతో మహారాష్ట్ర సర్కార్ బాబ్లీ గేట్లను తెరిచింది. 15 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు 136 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువన కుురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. తెలంగాణలోని ప్రియదర్శిని, జూరాల ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి: